రాయచోటిలో పర్యటించిన కమిషనర్
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని 16వ వార్డులో మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. శానిటేషన్, నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కొన్ని పనులు టెండర్ ప్రక్రియ వల్ల ఆలస్యం కావొచ్చని తెలిపారు.