'ఎన్నికల ప్రచారంలో చిన్నారితో ఎర్రబెల్లి సందడి'
MHBD: తొర్రూరు మండలం హచ్చు తండాలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎస్టీ జనరల్ అభ్యర్థి గుగులోత్ బిచ్చా ఎన్నికల ప్రచారంలో ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం తండాలో చిన్నారిని ఎత్తుకొని సందడి చేశారు.