నీలకంఠాపురం దేవస్థానంలో కదిరి పౌర్ణమి వేడుకలు

నీలకంఠాపురం దేవస్థానంలో కదిరి పౌర్ణమి వేడుకలు

సత్యసాయి: నీలకంఠాపురం దేవస్థానంలో కదిరి పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకం, అలంకార తిరుమంజనం, సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మేళతాళాలతో స్వామివారి ఉత్సవ మూర్తి ఊరేగింపు, ప్రాకారోత్సవం కన్నుల పండువగా సాగాయి.