10 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు: డీఈవో

10 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు: డీఈవో

SRPT: జిల్లాలో ఈ నెల 10 నుంచి 13 వరకు డ్రాయింగ్, టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈరోజు డీఈవో అశోక్ తెలిపారు. ఇందుకోసం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందాలని, టైలరింగ్ అభ్యర్థులు సొంతంగా కుట్టు మిషన్లు తెచ్చుకోవాలని సూచించారు. రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయన్నారు.