నకిలీ సర్టిఫికెట్లు తయారీ.. ఇద్దరు అరెస్ట్
HYD: నకిలీ సర్టిఫికెట్లు తయారీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని ఓ జిరాక్స్ సెంటర్‌లో నకిలీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, మెడికల్, తదితర నకిలీ పత్రాలను విక్రయిస్తున్న సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. ఈ ఘటనలో హఫీజ్‌పేట ప్రేమ్ నగర్‌కి చెందిన మహ్మద్ సాజిద్ ఇంద్రానగర్‌కి చెందిన గంట రాజీవ్ గాంధీ అనే వ్యక్తులపై కేసు నమోదైంది.