విజయనగరం పైడితల్లి జాతర తేదీలు ఖరారు

VZM: ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ తేదీలను ఆలయ ఈవో శిరీష ఇవాళ ప్రకటించారు. అక్టోబర్ 6 న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు. అక్టోబర్ 7న అంగరంగ వైభవంగా అమ్మవారి సిరిమానోత్సవం ఉంటుందని, అక్టోబర్ 14 న తెప్పోత్సవం జరిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.