నేపాలోని తెలుగువారికి లోకేష్ అభయమిచ్చారు: అనగాని

AP: నేపాల్‌లోని తెలుగువారికి మంత్రి లోకేష్ అభయమిచ్చారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సహాయ చర్యలు చేపట్టారని చెప్పారు. నేపాల్‌లోని తెలుగువాళ్లను తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నారని తెలిపారు. నేపాల్ నుంచి ఇప్పటికే 22 మంది రాష్ట్రానికి చేరుకున్నారని వెల్లడించారు. గతంలోనూ విదేశాల్లో చిక్కుకున్న తెలుగువాళ్లను రక్షించారని గుర్తు చేశారు.