సలేశ్వరంలో భద్రతపై డీఐజీ సమీక్ష

సలేశ్వరంలో భద్రతపై డీఐజీ సమీక్ష

NGKL: లింగాల మండలం సలేశ్వరం జాతర భద్రత ఏర్పాట్లను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌తో కలిసి సమీక్షించారు. బందోబస్తుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, లోయలో పడిన వ్యక్తిని రక్షించిన ఎస్సై, కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా అభినందించారు. భక్తులు అప్రమత్తంగా ఉంటూ, అత్యవసర సమయాల్లో పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.