నానో యూరియాపై అవగాహన కార్యక్రమం

KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు నానో యూరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాధ మాట్లాడుతూ.. పంటలకు నానో యూరియాను నీటిలో కలిపి పిచికారి చేయవచ్చని తెలిపారు. ఇది మొక్కలకు త్వరగా పోషకాలను అందిస్తుందని, దాని వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.