బెదిరింపులతో నగదు వసూలు.. వ్యక్తి అరెస్ట్

బెదిరింపులతో నగదు వసూలు.. వ్యక్తి అరెస్ట్

NTR: మహిళల నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన ఓ వ్యక్తిని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులతో మహిళల వద్ద నుంచి నగదు వసూలు చేస్తున్న బాల వెంకటేశ్వర్లను భవానిపురం పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో పలుమార్లు నిందితుడికి భయపడి బాధితురాలు నగదు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.