దర్గాలో రాములోరి పెళ్లి.. ఫలహారం తిన్న ఉడుత
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నాగుల్ మీరా దర్గాలో హిందూముస్లింలు కలిసి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రాములోరి కోసం పెట్టిన ఫలహారాలను ఉడుత భుజించడం భక్తులను ఆకట్టుకుంది. ఏటా దర్గాలో జరిగే కళ్యాణ వేడుకల్లో ఉడుత వచ్చి ఇలానే ఫలహారం స్వీకరిస్తుందని స్థానికులు తెలిపారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.