షాద్‌నగర్‌లో మాజీ మంత్రికి ఘన స్వాగతం
RR: షాద్‌నగర్‌లో మాజీ మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వనపర్తి జిల్లాకు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. ఈ నేపథ్యంలో షాద్ నగర్ బైపాస్‌లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికారు.