భారీ వర్షాలకు కూలిన మట్టి మిద్దె

భారీ వర్షాలకు కూలిన మట్టి మిద్దె

NDL: సంజామల మండల కేంద్రంలో బుధవారం అధిక వర్షాలు రావడంతో తలారి రాముడుకు చెందిన మట్టి మిద్దె అక్కడికక్కడే కూలిపోయింది. దీంతో బాధితుడికి తీవ్ర నష్టం వాటిలింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు హుస్సేన్ సంఘటన స్థలానికి చేరుకొని కూలిపోయిన మట్టి మిద్దెను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుడికి అండగా ఉంటుందని హుస్సేన్ హామీ ఇచ్చారు.