ఫుడ్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపేసిన ఓలా

ఫుడ్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపేసిన ఓలా

ప్రముఖ క్యాబ్ సేవల ప్లాట్‌ఫామ్ ఓలా కన్స్యూమర్ తన ఫుడ్ డెలివరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలుస్తోంది. యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత ఓలా ఫుడ్స్ సేవలు ఇకపై అందుబాటులో లేవని కనిపిస్తున్నట్టు మనీకంట్రోల్ తన కథనంలో పేర్కొంది. యాప్ పాత వెర్షన్‌లో సైతం ఓఎన్‌డీసీ ద్వారా పనిచేసే క్లౌడ్ కిచెన్ వ్యాపార ఆర్డర్లను కూడా తీసుకోవడంలేదట.