జాతీయ రహదారిలోనే నాణ్యత లోపిస్తే ఎలా..?
MLG: తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారి పనుల్లో నాణ్యత లోపించడంతో రహదారి కింద ఉన్న మిషిన్ భాగీరథ పైప్ పగిలి, నీరు లీకై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిలోనే నాణ్యత లోపిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.