'రైతును రాజు చేసేలా ప్రభుత్వ ప్రణాళిక'
VSP: సంప్రదాయ వ్యవసాయానికి సాంకేతికను జోడించడం ద్వారా రైతులు మూడు రెట్ల ఆదాయాన్ని ఆర్జించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. బోని గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన "రైతన్న మీ కోసం" కార్యక్రమంలో ఆయన మాట్లాడురు. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న పంటలను రైతులు వేయాలన్నారు.