'ఉచిత బస్సు ప్రయాణాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి'
E.G: కొవ్వూరు ఆర్టీసీ డిపో వద్ద 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.