అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచుకున్న ముఠా అరెస్ట్
HNK: ప్రజల నుంచి కోట్ల రూపాయలను దోచుకున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. బుధవారం వీరి నుంచి 5 లక్షల 92 వేల నగదుతో పాటు, 684.5 గ్రాముల బంగారు నాణాలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.