స్వాతంత్య్ర వేడుకలలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర వేడుకలలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అధికారులను, శ్రోతలను, ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న కళాకారులను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సత్కరించారు.