అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

PDPL: సుల్తానాబాద్ మండలానికి చెందిన 52 మంది కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు, 152 మంది ముఖ్య మంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.