13 ఏళ్ల తర్వాత వివాదానికి తెర

PDPL: పెద్దపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ & లారీ ట్రాన్స్‌పోర్ట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ మధ్య వివాదానికి 13 ఏళ్ల తర్వాత తెర పడింది. 2012 సంవత్సరం నుంచి వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లారీలను అడ్డుకుంటున్నారని ఒకరిపై ఒకరు కోర్టులో ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఎవరి వ్యాపారం వారు చేసుకోవాలని నేడు తీర్పునిచ్చింది.