7 మండలాల్లో 110 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
వికారాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రెండో విడతలో భాగంగా 175 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో 110 స్థానాల్లో కాంగ్రెస్, 34 స్థానాల్లో బీఆర్ఎస్, 8 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇదిలావుంటే, 7 మండలాల్లో కలిపి 23 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.