VIDEO: చిన్నారుల మృతదేహాలకు టీడీపీ ఇన్‌ఛార్జ్ నివాళి

VIDEO: చిన్నారుల మృతదేహాలకు టీడీపీ ఇన్‌ఛార్జ్ నివాళి

KRNL: ఆస్పరి మండలం చిగిళిలో ఆరుగురు చిన్నారుల మృతిపై ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వీరభద్ర గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం మృతి చెందిన శశికుమార్, మహబూబ్ సాయికిరణ్, కిన్నెరసాయి, భీమా, వీరేంద్ర చిన్నారుల మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.