మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

VZM: విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై గణేష్ వెల్లడించారు. నెల్లిమర్ల మండలం సతివాడ మోడల్ స్కూల్లో సంకల్ప ప్రచార రథంతో గంజాయి వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయికి బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. అలాగే డ్రగ్స్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయన్నారు.