పేకాట ఆడుతున్న శిబిరంపై దాడులు

పేకాట ఆడుతున్న శిబిరంపై దాడులు

VZM: ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో సిబ్బందితో దాడులు చేపట్టగా పోతంపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై నవీన్ పడాల్ మంగళవారం తెలిపారు. వారి నుంచి  రూ16,400 నగదును స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. పోలీసు స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.