రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

KDP: మైదుకూరు సమీపంలోని విశ్వనాథపురం వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం నరసన్నపల్లికి చెందిన రమణయ్య మల్లేపల్లి సబ్ స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరుకు బైకుపై బయల్దేరాడు. విశ్వనాథపురం వద్ద కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయారు.