నగరంలో దోమలతో విలవిలలాడుతున్న ప్రజలు

నగరంలో దోమలతో విలవిలలాడుతున్న ప్రజలు

HYD: నగరంలో దోమల బెడద రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యం లోపం, నిలిచిన నీటితో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఫాగింగ్ చేయాలని, మురుగు కాల్వలను శుభ్రం చేసి దోమల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.