నిజాంసాగర్ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 40,289 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి 37,291 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 TMCలు కాగా ప్రస్తుతం 14.689 TMCలకు చేరిందని అధికారులు తెలిపారు.