VIDEO: మంత్రాలయంలో కర్ణాటక భక్తుడికి అస్వస్థత
KRNL: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన కర్ణాటకకు చెందిన భక్తుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. మంచాలమ్మ దేవిని, రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. తోటి భక్తులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, శ్రీమఠం అధికారి అనంతపురానికి, ప్రోటోకాల్ కానిస్టేబుల్ రంగస్వామి కలిసి భక్తుడిని మఠం ఆసుపత్రికి తరలించారు.