VIDEO: 'మార్కాపురం - మాల్యవంతునిపాడు రాకపోకలు బంద్'
ప్రకాశం: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో గంట గంటకు ఏదో ఒక స్థాయిలో వర్షం కురుస్తుంది. మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామంలో గల బ్రిడ్జిపై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో రాకపోకలు స్తంభించాయి. నీటి ప్రవాహం తగ్గేంత వరకు అటు ఇటు వాగు దాటువద్దని, సహకరించాలని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.