నా తండ్రి మాటను ఒక్క విషయంలో వినలేదు: మహేష్

నా తండ్రి మాటను ఒక్క విషయంలో వినలేదు: మహేష్

గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో తండ్రి కృష్ణను తలచుకుని మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి మాటను తాను ఎప్పుడు వినే వాడిని.. కానీ ఒక్క విషయంలో ఆయన మాట వినలేదని తెలిపారు. పౌరాణిక కథలో నటించమని.. అటువంటి చిత్రాల్లో చాలా బాగా ఉంటానని అన్నట్లు గుర్తుచేసుకున్నారు. అయితే ఆయన మాట వినలేదని.. కానీ తన మాటలు ఇప్పుడు కృష్ణ వింటుంటాడని చెప్పారు.