'బహిరంగ సభను జయప్రదం చేయండి'
సూర్యాపేటలో ఈ నెల 28న జరగనున్న కల్లు గీత కార్మిక సంఘం గీతన్నల రణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జనార్దన్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఇవాళ జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.