జిల్లాలో కార్డెన్ సెర్చ్.. 72 బైక్‌లు స్వాధీనం

జిల్లాలో కార్డెన్ సెర్చ్.. 72 బైక్‌లు స్వాధీనం

ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు సమస్యాత్మక గ్రామాలు, కాలనీల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లతోపాటు పాత నేరస్తుల ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశారు. ఈ ఆపరేషన్‌లో సరైన పత్రాలు లేని 72 బైక్‌లు, 5 ఇతర వాహనాలతోపాటు 64 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మట్కా బీటర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.