VIDEO: ప్రభుత్వ వైఫల్యాలపై BJP నిరసన
MDK: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించినట్లు పాపన్నపేట మండల బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం పాపన్నపేట తహసీల్దార్‌కు మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు రుణమాఫీని అమలు చేయలేదని ఈ సందర్భంగా వాపోయారు.