తణుకులో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ ర్యాలీ

తణుకులో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ ర్యాలీ

W.G: తణుకు మునిసిపాలిటీ పరిధిలోని బ్యాంక్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డానియల్ రాజు ఆధ్వర్యంలో సోమవారం "ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం" నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ.. రెండు వారాల పైబడి దగ్గు ఉన్నా, బరువు తగ్గుతున్నా, జ్వరం ఉన్నా, కఫంలో రక్తం పడుతున్నా విధిగా హెల్త్ సెంటర్‌ను సంప్రదించాలని తెలియజేశారు.