సైకిల్‌పై వెళ్తున్న వృద్దుడిని ఢీ కొట్టిన డీసీఎం.. స్పాట్ డెడ్
నిజామాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న ఓ వృద్దుడిని డీసీఎం ఢీ కొట్టింది. ఇవాళ తెల్లవారుజామున డిచ్‌పల్లి మండలం ధర్మారం బస్ స్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సైకిల్‌పై వెళ్తున్న ధర్మారం గ్రామానికి చెందిన కుంటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.