కోడి పందాల స్థావరంపై దాడి.. ఆరుగురి అరెస్ట్

ELR: కొయ్యలగూడెం మండలం సరిపల్లి సమీపంలో కోడి పందేల స్థావరంపై దాడి చేసి, ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై వి. చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో వారి నుంచి రూ. 12,200 నగదు, ఐదు బైకులు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. కోడి పందేలు, పేకాట గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.