ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యాన్నిస్తూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.