సత్యసాయి మందిరంలో కంటి వైద్య శిబిరం
NGKL: భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా, నానక్రామ్ గూడ సత్యసాయి మందిరంలో శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 72 మందికి పరీక్షలు నిర్వహించగా, 10 మందికి క్యాటరాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. వారికి ఆపరేషన్ కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.