మంత్రి సీతక్క కీర్తిని దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారు
MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నాగమణి మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఆధారాలు చూపించాలని, లేకపోతే కోర్టులో తేల్చుకుందామని సవాల్ విసిరారు. మంత్రి సీతక్క కీర్తిని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలను ఖండించారు.