'అన్నదాత సుఖీభవ' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: పెదపాడు మండలం వట్లూరులో అన్నదాత సుఖీభవ- రైతన్న కోసం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులకు సీఎం అందించిన అభినందన లేఖను అందజేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ, పండించిన ధాన్యాన్ని రైతు సేవ కేంద్రాల ద్వారా గంటల వ్యవధిలోనే సొమ్మును ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిపారు.