చమ్మచింతలో వైద్య శిబిరం ఏర్పాటు

VSP: చమ్మచింత గ్రామంలో డెంగ్యూ జ్వరాలు పెరగడంతో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు రక్త పరీక్షలు చేసి సంబంధిత వ్యాధులను గుర్తించి వారికి మందులు అందజేశారు. అనంతరం గ్రామంలో గల మురుగు నీరు ఉండే ప్రదేశాలను వైద్యాధికారులు పరిశీలించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ప్రశాంతి, రాజేష్ నాయుడు పాల్గొన్నారు.