గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఇవాళ్టి నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 89 పోస్టుల భర్తీకి జరుగుతున్న ఈ పరీక్షల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,496 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.