రహస్యంగా సామాన్లను సర్దుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్..!
వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అక్రమ మార్కుల కుంభకోణం కేసులో ముఖ్య నిందితుడిగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ , తన క్యాంపు కార్యాలయంలోని విలువైన ఫర్నిచర్, వస్తువులను రహస్యంగా హైదరాబాద్‌లోని తన ఇంటికి తరలిస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్ విచారణలో వేటు తప్పదనే భయంతో ఆధారాలు దాచే ప్రయత్నంగా ఈ చర్య ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.