నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
CTR: నగరి పట్టణ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ నిమిత్తం ఇవాళ ఉదయం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏడీ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలని కోరారు.