'అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా అక్షరాంధ్ర'

'అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా అక్షరాంధ్ర'

ELR: వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. జిల్లాలో 100 గంటల శిక్షణతో ఈఏడాది 97,200 నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రథమ స్ధానంలో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.