హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: ఎస్పీ

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: ఎస్పీ

KRNL: పోలీస్ శాఖలో హోంగార్డుల విధులు, సేవలు ఆదర్శప్రాయమని SP విక్రాంత్ పాటిల్ అభినందించారు. ఇవాళ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో SP ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారన్నారు.