చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్: మోస్రా మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.