VIDEO: కుక్కల దాడిలో మృతి చెందిన 18 గొర్రెలు
VZM: కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి చెందిన ఘటన వేపాడ మండలం రామస్వామి పేటలో గురువారం చోటు చేసుకుంది. గొర్రెల యజమానులు దుక్క గణేష్, పత్రి గోవింద గొర్రెలను మేత కొరకు ఆరు బయటకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కుక్కల గుంపు దాడి చేయగా 18 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.