కొళాయి పన్ను చెల్లించని ట్యాపులకు డమ్మీలు

AKP: రావికమతం మండలం కొత్తకోట పంచాయతీలో కొళాయి పన్ను చెల్లించని ట్యాప్‌లకు పంచాయతీ సిబ్బంది డమ్మీలు వేస్తున్నారు. పంచాయతీలో 2వేల ఇంటింటికి కొళాయిలు కనెక్షన్లు వేశారు. సంవత్సరానికి ఒక్కొక్క కనెక్షన్ కు రూ.600 పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ నేపధ్యంలో పన్ను చెల్లించకపోవడంతో ఈ కొళాయి ట్యాప్‌లకు డమ్మీ చేస్తున్నారు.